VIDEO: కనుములోపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు

VIDEO: కనుములోపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు

KDP: సిద్ధవటం మండలం కనుములోపల్లెలోని నీలకంఠేశ్వర స్వామి శివాలయంలో సోమవారం శివుడికి ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించారు. దీపావళి పర్వదినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చి శివుడికి అభిషేక పూజలు చేపట్టారు. ఇక్కడ ప్రతిష్టింపబడిన 108 శివలింగాలకు మహిళలు కుంకుమ, విభూది దిద్ది ప్రత్యేక పూలతో అలంకరించారు.