'మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి'
MHBD: కొత్తగూడ మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, చదువుతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. "నేటి బాలికలే రేపటి ఆదర్శ మహిళలు" అని పేర్కొన్నారు.