ఎందరో యోధులు, మేధావులు చేసిన పోరాట ఫలం స్వాతంత్య్రం: ఎమ్మెల్యే

MHBD: మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎమ్మెల్యే మురళీ నాయక్ ఆవిష్కరించారు. ఎందరో యోధులు, మేధావులు చేసిన పోరాట ఫలం స్వాతంత్య్రం అని, భిన్నత్వంలో ఏకత్వం దేశ విశిష్ఠత అన్నారు. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న ఈ ప్రత్యేకతను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.