రైలు ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
భువనగిరి మున్సిపల్ పరిధిలోని జెడ్పీహెచ్ఎస్ రాయగిరి-2006/7 బ్యాచ్ మంగళవారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 20 ఏళ్ల తర్వాత కలిసిన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ఆనందాన్ని పంచుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులు సాయిలు, అరుణ, గౌస్, రాజశేఖర్ రెడ్డిలను షీల్డ్ శాలువాతో ఘనంగా సన్మానించారు.