VIDEO: సీఐ పేరుతో ఫేక్ అకౌంట్.. డబ్బులు పంపొద్దు
MDK: తన పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సృష్టించి సైబర్ నేరగాళ్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని రామాయంపేట సీఐ వెంకట్ రాజా గౌడ్ హెచ్చరించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తులు తన ఫోటోతో ఖాతా తెరిచి, క్యూఆర్ కోడ్ పంపిస్తూ డబ్బులు అడుగుతున్నారని తెలిపారు. ఇలాంటి మోసపూరిత సందేశాలను ఎవరూ నమ్మవద్దని ప్రజలకు తెలియజేశారు.