రైతుల సమస్యలు పరిష్కరించాలి: సీపీఐ
KRNL: కోడుమూరు సీపీఐ కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నక్కి లెనిన్ బాబు మాట్లాడుతూ.. గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు ఇవ్వాలన్నారు. రైతులు పండించిన పత్తి, ఉల్లి, కంది, వేరుశనగ తదితర పంటలకు మద్దతు ధర ప్రకటించాలన్నారు. హమాలి కార్మికులకు కనీస వేతనం అమలు చేసి వారికి భద్రత కల్పించాలన్నారు.