చిన్న పొట్లాలు.. విద్యార్థులే టార్గెట్..!
ATP: జిల్లా కేంద్రంలో ఇటీవల చాపకింద నీరులా గంజాయి విస్తరిస్తోంది. పోలీసు నిఘా సక్రమంగా లేక అక్రమ రవాణాదారులు రెచ్చిపోతున్నారు. చిన్న పొట్లాల్లో చుట్టి సరఫరా చేస్తున్నారు. ఇటీవల పట్టుబడిన ఏడుగురు గంజాయి ముఠా పెద్ద ఎత్తున నగరంలోనూ, శివారు ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తుల్లో తేలింది. డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అన్ని PSలో దృష్టి సారించినట్లు తెలిపారు.