హైకమాండ్ చెప్పినప్పుడే ప్రశ్నించాలి: సిద్ధరామయ్య
కర్ణాటకలో సీఎం మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. నాయకత్వ మార్పు గురించి కాంగ్రెస్ హైకమాండ్ ఏమైనా చెప్పిందా అని మీడియాను ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రజల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలైన ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ ఈ విషయంపై ఏమైనా చెప్పినప్పుడే దాని గురించి ప్రశ్నించాలని సూచించారు.