VIDEO: నెయ్యి ట్యాంకర్ బోల్తా.. ఎగబడ్డ ప్రజలు..!
KDP: కొండాపురం మండలం చిత్రావతి వంతెన సమీపంలో నెయ్యి ట్యాంకర్ బోల్తా పడింది. పుణే నుంచి తిరుమల దేవస్థానానికి 21 వేల లీటర్ల నెయ్యి తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ట్యాంకర్ నుంచి నెయ్యి నేలపాలు కావడంతో స్థానికులు బిందెలు, బకెట్లు, బాటిళ్లతో తీసుకెళ్లేందుకు ఎగబడ్డారు. పోలీసులు చేరుకుని వారిని అడ్డుకున్నారు. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్పంగా గాయపడ్డారు.