'మహిళలపై జరుగుతున్న దాడులు అరికట్టాలి'

'మహిళలపై జరుగుతున్న దాడులు అరికట్టాలి'

KMR: మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఛైర్మన్ వరప్రసాద్ అన్నారు. కామారెడ్డిలో మహిళపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలన్నారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి పాల్గొన్నారు.