చౌడేశ్వరి దేవి సన్నిధిలో 16 నుంచి చండీయాగం

చౌడేశ్వరి దేవి సన్నిధిలో 16 నుంచి చండీయాగం

NDL: బనగానపల్లె మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నందవరం చౌడేశ్వరి మాత ఆలయంలో ఈనెల 16నుంచి చండీయాగం నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ పీవీ నాగార్జున రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి హాజరుకానున్నట్లు వెల్లడించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని 16 నుంచి 18 వరకు జరిగే చండీయాగం విజయవంతం చేయాలని కోరారు.