కూకట్‌పల్లి కేసులో మరో ట్విస్ట్

HYD: కూకట్ పల్లి సహస్ర హత్య కేసులో మరో సంచలనం బయటపడింది. నిందితుడు సహస్ర బర్త్ డే వేడుకల్లో పాల్గొని కేక్ తినిపించాడని, అప్పుడే ఇంటిని పరిశీలించి దోపిడీకి ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దొంగతనం చేస్తుండగా సహస్ర చూడటంతో దొరికిపోతానేమోనన్న భయంతో కత్తితో 21 పోట్లు పొడిచాడని పోలీసులు వెల్లడించారు. హత్య అనంతరం ఏమీ తెలియనట్లు జనంలో కలిసి తిరిగినట్లు తెలిపారు.