కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే

KMR: పట్టణంతో పాటు నియోజకవర్గంలో జరిగిన ఆస్తి, పంట నష్టంపై కేంద్ర ప్రభుత్వం ద్వారా సహాయం అందించాలని ఎమ్మెల్యే కేవీఆర్ కోరారు. ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖమంత్రి కిషన్ రెడ్డిని ఎమ్మెల్యే కలిశారు. ప్రకృతి విపత్తు కింద సాధ్యమైనంత త్వరగా ప్రత్యేక నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు చెప్పారు.