ఐస్ ఫ్యాక్టరీలపై ఆకస్మిక తనిఖీలు

ఐస్ ఫ్యాక్టరీలపై ఆకస్మిక తనిఖీలు

SKLM: ఆమదాలవలసలోని వరదా వారి క్వార్టర్స్, పూజారి పేట ప్రాంతాల్లో ఉన్న ఐస్ ఫ్యాక్టరీలను కమిషనర్ టి.రవి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫ్యాక్టరీలకు సంబంధించిన అనుమతి పత్రాలను పరిశీలించారు. ఐస్ తయారీలో నాణ్యమైన ముడి పదార్థాలు ఉపయోగించాలని, కాలపరిమితి దాటిన ఐస్ క్రీమ్‌లను విక్రయించరాదని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సెక్రెటర సింహాచలం ఉన్నారు.