ఉప్పల్లో ట్రాఫిక్.. రోడ్లు విస్తరించాలని డిమాండ్..!

మేడ్చల్: వరంగల్ హైవే ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద పాదాచారులకు వీలుగా ఉండేందుకు స్కైవాక్, రోడ్డు మధ్యలో హై రైస్ డివైడర్లు నిర్మించి చర్యలు చేపట్టినప్పటికీ ట్రాఫిక్ సమస్య మాత్రం తగ్గడం లేదు పరిసర ప్రాంతాలలో అంతర్గత రోడ్లు ఇరుకుగా ఉండటంతో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు పెరుగుతుంది. అనేక చోట్ల రహదారుల విస్తరణ జరపాల్సిన అవసరం ఉందని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు.