సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్: ఎస్పీ

SRPT: రాజీమార్గం రాజమార్గమని, రాజీపడితే ఇద్దరూ గెలిచినట్లేనని ఎస్పీ నరసింహ అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 13న జరుగనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజీమార్గం రాజమార్గమని చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దని సూచించారు.