బాల్యవివాహాల నివారణపై అవగాహన
RR: షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం వెలిజర్ల గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఐసీడీసీ సూపర్వైజర్ జయలక్ష్మి ఆధ్వర్యంలో 'బేటి బచావో-బేటి పడావో' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు విద్యాభద్రత, హక్కులు, అభివృద్ధి, బాల్య వివాహాల నివారణపై అవగాహన కల్పించారు. బాల్య వివాహం గురించి తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు.