కరెంట్ షాక్‌తో అసిస్టెంట్ లైన్‌మెన్ మృతి

కరెంట్ షాక్‌తో అసిస్టెంట్ లైన్‌మెన్ మృతి

SDPT: కోహెడ(M) నారాయణపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు వివరాల మేరకు.. గ్రామంలోని వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ తీగలు కిందకు ఉన్నాయని రైతులు అసిస్టెంట్ లైన్‌మెన్‌కు సమాచారం ఇచ్చారు. వరి కోతల అనంతరం LC తీసుకుని వైర్లను పైకి ఎత్తి పని చేస్తుండగా అతడు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.