22 భాషల్లో మేడారం భక్తులకు సూచనలు
హనుమకొండ జిల్లా కేంద్రంలో నేడు 22 భాషలతో మేడారం జాతర అవగాహన ర్యాలీని జిల్లా అడిషనల్ కలెక్టర్ రవి ప్రారంభించారు. కలెక్టరేట్ కార్యాలయం ఎదుట 22 భాషల్లో రచించిన సూచనలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బద్రు, సామాజికవేత్త ఈవీ శ్రీనివాసరావుతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.