పైడిమర్రి వెంకట సుబ్బారావు వర్థంతి

SRCL: భారత జాతీయ ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు 37వ వర్థంతి సందర్భంగా వేములవాడ న్యూ అర్బన్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ప్రతిజ్ఞ ద్వారా దేశభక్తి, జాతీయ సమైక్యతకు పైడిమర్రి విశేంషంగా తోడ్పడ్డారని అన్నారు.