గుంతకల్లులో శతాధిక వృద్ధుడు మృతి

ATP: పాతగుంతకల్లులో శతాధిక వృద్ధుడు రామిరెడ్డి మృతిచెందాడు. 101 ఏళ్ల వయసులో మృతి చెందారని కుమారుడు నగేశ్ తెలిపారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం కన్నుమూశారు. 98 సంవత్సరాల వయసు వరకు రోజుకు మూడు కిలోమీటర్లు నడిచేవారని కుటుంబ సభ్యులు గుర్తు చేసుకున్నారు. రామిరెడ్డికి ఆరుగురు కుమారులు కాగా ముగ్గురు గతంలోనే చనిపోయారన్నారు.