నేడు రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం
KMM: కామేపల్లి, పాతలింగాల, కొమ్మినేపల్లి రైతు వేదికల్లో ఇవాళ మధ్యాహ్నం 2:00 గంటలకు నిర్వహించే 'రైతు నేస్తం' వీడియో కాన్ఫరెన్స్‌కు రైతులంతా హాజరుకావాలని మండల వ్యవసాయాధికారి బి.తారాదేవి కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరిగే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చని తెలిపారు.