గుజరాత్‌లో రూ. 25 కోట్ల విలువైన డైమండ్స్ చోరీ

గుజరాత్‌లో రూ. 25 కోట్ల విలువైన డైమండ్స్ చోరీ

గుజరాత్‌లోని ఓ డైమండ్ కంపెనీలో భారీ వజ్రాల చోరీ జరిగింది. దాదాపు రూ.25 కోట్లు విలువ చేసే వజ్రాలను దోచుకున్నారు. కంపెనీలోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి వజ్రాలను చోరీ చేశారు. ఆ సమయంలో సీసీటీవీ కెమెరాలు కూడా ధ్వంసం కావడం గమనార్హం. వరుసగా మూడురోజులు సెలవులు ప్రకటించడంతో ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది లేని సమయంలో ఈ వజ్రాల చోరీ జరిగినట్లు కంపెనీ పేర్కొంది.