టెక్నాలజీ వినియోగంపై కానిస్టేబుల్‌లకు ట్రైనింగ్

KNR: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు టెక్నాలజీ వినియోగంపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఐటీ కార్యాలయంలో పోలీసులు ఉపయోగించే సాఫ్ట్‌వేర్, అప్లికేషన్లు, సాంకేతిక పరిజ్ఞానంపై ఈ శిక్షణ జరిగింది. పోలీసులకు సవాల్‌గా మారిన టెక్నాలజీ మోసాల నియంత్రణకు ఈ శిక్షణ ఉపయోగపడనుంది.