VIRAL: ఓటమితో మాస్క్ తొలగిస్తారా?
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించే వరకు మాస్క్ తీయనని శపథం చేసిన ఫ్లూరల్స్ పార్టీ అధ్యక్షురాలు పుష్పమ్ ప్రియా చౌదరికి నిరాశ ఎదురైంది. దర్భంగా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె ఓడిపోయారు. ఎప్పుడూ నల్లటి దుస్తులు ధరించి, మాస్క్‌తో కనిపించే ఆమె, గెలిచాకే మాస్క్ తీస్తానని ప్రచారం చేశారు. ఇప్పుడు ఓడిపోవడంతో తన శపథాన్ని ఏం చేస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.