ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక పిలుపు
AP: రాష్ట్రంలో జనగణన ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో జనగణన కీలక మైలురాయి అని తెలిపారు. 'ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలన్నా, మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్నా వాస్తవ గణాంకాలు ఉండాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ జనగణనలో భాగస్వామ్యం కావాలి. అధికారులు అడిగే వివరాలను ప్రజలు నిర్భయంగా వెల్లడించాలి' అని సూచించారు.