ఎయిరిండియా సీఈవో విల్సన్ రాజీనామా?
ఎయిరిండియా CEO క్యాంప్‌బెల్ విల్సన్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తదుపరి CEOను నియమించేవరకు ఆయననే కొనసాగనున్నట్లు పలు జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఎయిర్‌లైన్ కార్యకలాపాల్లో అంతరాయాలు, పెరిగిన ఖర్చులు, ఈ ఏడాది నష్టాల నేపథ్యంలో ఇది చోటుచేసుకున్నట్లు సమాచారం. గత వారమే విల్సన్ రాజీనామాను బోర్డు ఆమోదించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.