పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
ELR: నిడమర్రు మండలం పెద నిండ్రకొలను గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే ధర్మరాజు పర్యటించారు. ఈ సందర్భంగా MGNREGS నిధులు రూ.1 కోటి 50 లక్షల అంచనా వ్యయంతో దేవర గోపవరం గ్రామంలో నుంచి నిడమర్రు రోడ్డు వరుకు నిర్మించబోయే W.B.M రోడ్డు నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.