బెంగాల్ ఎన్నికలు.. ఈసీ కీలక నిర్ణయం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల సౌకర్యార్థం ఎన్నికల సంఘం(EC) కీలక నిర్ణయం తీసుకుంది. 1200 మందికి మించి ఓటర్లున్న ప్రాంతాల్లో కొత్తగా 4,660 అనుబంధ(Auxiliary) పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే, ఓటర్ల వెసులుబాటు కోసం 321 కేంద్రాలను ఇతర ప్రాంతాలకు మార్చింది. వీటితో కలిపి బెంగాల్ వ్యాప్తంగా మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 85,379కి చేరింది.