వరద తగ్గడంతో శ్రీశైలం గేట్లు మూసివేత

వరద తగ్గడంతో శ్రీశైలం గేట్లు మూసివేత

NDL: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి తగ్గింది. దీంతో అధికారులు జలాశయం రేడియల్ క్రస్టు అన్ని గేట్లను మూసివేశారు. ఈ సీజన్‌లో నాలుగోసారి గేట్లు ఎత్తి మళ్ళీ అన్ని మూసివేశారు. ఇన్ ఫ్లో 1,20,388 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 66,327 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 883.80 అడుగుల వద్దకు నీరు చేరింది.