ఎమ్మెల్యే యెన్నంకు ప్రభుత్వ విప్..!
MBNR: రాష్ట్రంలో మరో ముగ్గురు నూతన విప్‌లను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి అవకాశం కల్పించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై త్వరలోనే ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన వెలువడనుంది.