మాజీ కౌన్సిలర్‌ను పరామర్శించిన MLA

JGL: పట్టణ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి భర్త మాజీ కౌన్సిలర్ అడువాల లక్ష్మణ్ కొండగట్టు వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మణ్‌ను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆసుపత్రికి వెళ్ళి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని పరామర్శించారు.