బాధితులతో వీడియో కాల్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే
VZM: విజయనగరం వి.టి అగ్రహారం చుక్క వీధిలో నివసిస్తున్న పొదిలాపు పాపునాయుడు, లావేటి గౌరీ, గ్రంథం లక్ష్మిల ఇల్లులు తుఫాన్ కారణంగా దెబ్బతిని కూలిపోయాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అదితి గజపతిరాజు బాధితుల వద్దకు పార్టీ నాయకులను పంపించి, బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా బాధితులతో వీడియో కాల్‌లో మాట్లాడి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.