మిషన్ భగీరథ హెల్పర్‌ను కలెక్టర్‌కు సరెండర్
SRD: కల్హేర్ మండలంలో మిషన్ భగీరథ హెల్పర్ బొమ్మల బాలరాజును కలెక్టర్‌కు సరెండర్ చేస్తూ మిషన్ భగీరథ ఎస్ఈ ఎన్.రఘువీర నేడు ఉత్తర్వులు జారీ చేశారు. బాలరాజుపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. తప్పుడు ధ్రువపత్రాలతో ఉద్యోగంలో చేరాడని, ఒక కేసులో కోర్టుకు హాజరై కార్యాలయంలో హాజరు వేసుకున్నట్లు ఫిర్యాదులు అందాయని అధికారులు తెలిపారు.