'పహల్గాం అమరులకు నాయకుల ఘన నివాళి'

ADB: పహల్గాం ఉగ్రదాడిలో అమరులైన కుటుంబాలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జైనథ్ మండలంలోని నిరాల గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో TPCC ఉపాధ్యక్షుడు తహేర్ బిన్ హమ్దాన్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ శ్రీనివాసరెడ్డి పాల్గొని ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిలో అమరులైన వారికి ఘన నివాళులర్పించారు.