VIDEO: 'ఆశా వర్కర్ల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి'
NRML: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆశా వర్కర్లకు రూ. 18 వేల వేతనం చెల్లించాలని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ డిమాండ్ చేశారు. శనివారం వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఆశా వర్కర్లు భైంసాలోని ఎమ్మెల్యే నివాసంలో ఆయనకు వినతిపత్రం సమర్పించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఆశా వర్కర్ల పక్షాన గళం విప్పుతానని హామీ ఇచ్చారు.