యాచకులకు దుప్పట్లు పంపిణీ
CTR: పుంగనూరులో రోటరీ క్లబ్ వారు యాచకులకు మరియు నిరాశ్రయులకు గురువారం దుప్పట్లను పంపిణీ చేశారు. ప్రస్తుతం పట్టణంలో చలి అధికంగా ఉండటం వల్ల ఎంతోమంది నిరాశ్రయులు చలికి తట్టుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిని గమనించిన రోటరీ క్లబ్ వారు సుమారు 80 మందికి నిరాశ్రయులకు దుప్పట్లను పంపిణీ చేశారు.