చిలకలూరిపేటలో పోగొట్టుకున్న ఫోన్లు అందజేత
PLD: సెల్‌ఫోన్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని చిలకలూరిపేట సీఐ రమేష్ అన్నారు. పట్టణ పరిధిలో వివిధ సందర్భాల్లో ఫోన్లు పోగొట్టుకున్న బాధితుల 10 సెల్‌ఫోన్లను ఇవాళ అందజేశారు. ఫోన్లు పోయినా, చోరీకి గురైనా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. అలాగే, పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.