ఇల్లందులో పర్యటించిన సింగరేణి డైరెక్టర్

BDK: సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ వెంకన్న జాదవ్ ఆదివారం ఇల్లందులో పర్యటించారు. అనంతరం పూసపల్లి ఉపరితల గని ప్రాంతాన్ని సందర్శించి మైనింగ్ కార్యకలాపాలపై సమగ్ర అవగాహన పొందారు. సీహెచ్‌పీ ప్రాంతంలో బొగ్గు లోడింగ్ విధానాన్ని పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. అనంతరం జీఎం కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.