'ద్విచక్ర వాహన దారులు తప్పక హెల్మెట్ ధరించాలి'
శ్రీకాకుళం: వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా మోటార్ వాహన చట్ట నిబంధనలను పాటించాలని శక్తి టీం హెచ్‌సీలు ఎం. గిరిధర్, కే. గణేష్ తెలిపారు. ఆదివారం కోటబొమ్మాలి మండలం మంచాల పేటలో స్థానికులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ విధిగా వాడాలని సూచించారు. ప్రమాదాలు జరిగేటప్పుడు 1033 టోల్ ఫ్రీ నెంబర్‌ను వినియోగించాలన్నారు.