'అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి'
AKP: వేతనాలు రూ.26,000కు పెంచాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. శనివారం కోటవురట్లలో సమస్యలు పరిష్కరించాలని ర్యాలీ నిర్వహించి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. విజయవాడ వెళ్ళిన అంగన్వాడీ కార్యకర్తలను చర్చలకు ఆహ్వానిస్తామని చెప్పి అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు.