ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తహసీల్దార్
MLG: వెంకటాపూర్ మండలం రామానుజాపూర్ గ్రామంలో వెంకటేశ్వర వీవో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ గిరిబాబు ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి భగవాన్ రెడ్డి, మాజీ ఎంపీపీ బుర్ర రజిత సమ్మయ్య పాల్గొన్నారు.