నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

VSP: గ్రేటర్ విశాఖ 39వ వార్డులో డాన్ బాస్కో నవజీవన్ భవనాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డాన్ బాస్కో నవజీవన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలతో పాటు, విద్య, ఉద్యోగాల కల్పన, యువతీ యువకులకు స్కిల్ ట్రైనింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.