బాపట్ల మండల అధికారిగా శ్రీరాములు

బాపట్ల మండల అధికారిగా శ్రీరాములు

BPT: ఈస్ట్ బాపట్ల పంచాయతీ కార్యదర్శి పల్నాటి శ్రీరాములుకు పదోన్నతి లభించింది. ఆయనను డిప్యూటీ ఎంపీడీవోగా, డెప్యుటేషన్‌పై మండల సచివాలయాల శాఖ అధికారిగా కలెక్టర్ నియమించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం ఆయన బాపట్ల ఎంపీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు జిల్లా అధికారి విజయలక్ష్మి, ఎంపీడీవో బాబురావు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.