వేణుగోపాలస్వామి ఆలయంలో చలివేంద్రం
NTR: గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో వెంచేసియున్న శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో భక్తులకు త్రాగు నీరు సౌకర్యార్ధం చలివేంద్రం ప్రారంభించినట్లు ఆలయ కమిటీ సభ్యులు నిన్న తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు మజ్జిగ పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ సహాయ కమిషనర్ సంధ్య, గ్రామ పెద్దలు మధుసూదనరావు, చిన్న అనంతరామయ్య, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.