సాఫ్ట్‌వేర్ టు సాగుబడి.. డ్రోన్‌తో జశ్వంత్ విజయం

సాఫ్ట్‌వేర్ టు సాగుబడి.. డ్రోన్‌తో జశ్వంత్ విజయం

నెల్లూరు రూరల్ మండలం పెనుబర్తికి చెందిన జశ్వంత్ సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి వ్యవసాయంలో సత్తా చాటుతున్నాడు. 2021లో ఉద్యోగానికి స్వస్తి పలికి, 70 ఎకరాల్లో(40 సొంతం+30 కౌలు) సాగు చేస్తున్నాడు. కూలీల సమస్యకు చెక్ పెడుతూ డ్రోన్లతో రోజుకు 150 ఎకరాల్లో మందు పిచికారీ చేస్తున్నాడు. సాఫ్ట్‌వేర్ కంటే ఇందులోనే ఎక్కువ ఆదాయం, సంతృప్తి ఉందని జశ్వంత్ తెలిపాడు.