ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు

KRNL: గోనెగండ్ల శివారులో పెను ప్రమాదం తప్పింది. ఎమ్మిగనూరు - కర్నూలు ప్రధాన రహదారిలో వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ తిమ్మన్న బస్సును నిలిపి ప్రయాణికులను దింపేశాడు. వెంటనే అగ్నిమాపక శాఖకు తెలియాజేయటంతో ఫైరింజన్‌ల సహయంతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.