రజతోత్సవ సభ చరిత్రలో నిలుస్తుంది: ఎమ్మెల్యే

SRD: ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలుస్తుందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సోమవారం తెలిపారు. రజతోత్సవ సభకు తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పారు. ఇది ఆరంభం మాత్రమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై మరింత పోరాటం చేస్తామన్నారు