బండరాయితో కొట్టి వ్యక్తి హత్య
TG: హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ముఖంపై బండరాయితో కొట్టి దుండగులు దారుణంగా హత్యచేశారు. మృతదేహాన్ని ఆటోలో తీసుకొచ్చి తార్నాక ఎర్రకుంటలో పడేశారు. ఓయూ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.