'రైతుల ఇంటికి వెళ్లి అవగాహన కల్పించాలి'

VSP: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన అన్నదాత సుఖీభవ పథకం అందని రైతుల ఇంటికి వెళ్లి ఆధార్ నమోదుపై అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు అప్పలస్వామి అన్నారు. పద్మనాభం మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన వ్యవసాయ శాఖ అసిస్టెంట్లు, వీఆర్వోలతో మాట్లాడి స్పష్టంగా తెలిపారు.